Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్ : అమెరికాలో మంకీపాక్స్ కేసులు 39 రాష్ట్రాలకు విస్తరించాయి. అమెరికాలో ప్రస్తుతం 767 కేసులు ఉన్నాయి. న్యూయార్క్లో అత్యధికంగా 153 కేసులు ఉండగా, కాలిఫోర్నియాలో 136 కేసులు ఉన్నాయి. ఇల్లినాయిస్లో 91 కేసులు ఉన్నాయి. మంకీఫాక్స్ కేసులు విస్తరిస్తుండటంతో సోమవారం నుంచి 1,44,000 జిన్నెయోస్ వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేయడం ప్రారంభిస్తామని హెల్త్ అండ్ హ్యుమన్ సర్వీసెస్ (హెచ్హెచ్ఎస్) ప్రకటించింది. ఈ వ్యాక్సిన్ను మంకీపాక్స్, మశూచి కోసం అమోదించారు. అలాగే దేశంలో మంకీపాక్స్ కేసులు విస్తరిస్తుడటంతో నార్త్ కరోలినాలో ఉన్న అమెరికా ప్రభుత్వ రంగ కంపెనీ ల్యాబ్ కార్ప్ ప్రధానకార్యాలయంలోనూ మంకీ పాక్స్ పరీక్షలను ప్రారంభించారు. ఇక్కడ వారానికి 10 వేల పరీక్షలను నిర్వహించే సామర్థ్యం ఉంది.