Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముందు వరసలో రిషి సనాక్
లండన్ : బ్రిటన్ ప్రధానమంత్రి పదవీ కోసం ప్రస్తుతానికి తొమ్మిది మంది పోటీలో ఉన్నారు. వీరిలో భారత సంతతికి చెందిన మాజీ క్యేబినేట్ మంత్రి రిషి సనాక్ వీరిలో ముందు వరసలో ఉన్నారు. వాణిజ్య మంత్రి పెన్నీ మౌర్డౌంట్ రెండో ప్రధాన అభ్యర్థిగా ఉన్నారు. మౌర్టౌంట్ తన అభ్యర్థిత్వాని ఖరారు చేస్తూ ఒక వీడియా మెసేజ్ విడుదల చేశారు. వీరిద్దరితో పాటు రవాణా మంత్రి గ్రాంట్ షాప్స్, విదేశాంగ శాఖ మాజీ మంత్రి జెరెమీ హంట్, పాకిస్థాన్ సంతతికి చెందిన మాజీ ఆరోగ్య మంత్రి సాజిద్ జావిద్ కూడా ప్రధానమంత్రి పదవికి రేసులో ఉన్నారు. వీరితో పాటు భారత సంతతికే చెందిన అటార్నీ జనరల్ సౌల్లె బ్రారెర్మాన్, ఇరాక్ సంతతికి చెందిన నదీమ్ జహవీ, నైజీరియా సంతతికి చెందిన బెడానోక్, టోరీ బాక్బెంచర్ కూడా ప్రధాన మంత్రి పదవీకి పోటీలో ఉన్నారు. అలాగే మరోవైపు విదేశాంగ శాఖ కార్యదర్శి లిజ్ ట్రూస్ కూడా త్వరలో అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తారని సమాచారం. దీంతో ప్రధాని రేసులో అభ్యర్థుల సంఖ్య 10కి చేరుకునే అవకాశం ఉంది. అయితే వీరిలో రిషి సనాక్ వీరిలో ముందు వరసలో ఉన్నారు. ఇప్పటికే తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు.