Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోబో షిఫ్‌ను తయారుచేసిన చైనా
బీజింగ్ : నేలపైనా, నీటిలోనా పేరుకుపోతున్న ప్లాస్టిక్ భూతాన్ని సమూలంగా నిర్మూలించేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అమల్లోకి వచ్చేసరికి అన్నీ విఫలమవుతునే వున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సముద్ర జలాల్లోకి చేరుతున్న మైక్రో ప్లాస్టిక్స్‌ను తినేసే రోబో ఫిష్‌ని చైనా శాస్త్రవేత్తలు అభివృద్దిపరిచారు.
వాయవ్యచైనాలోని సిచువాన్ యూనివర్శిటీకి చెందిన చైనా శాస్త్రవేత్తల బృందం ఈ ఆవిష్కరణను తీసుకువచ్చింది. దీంతో కాలుష్య కాసారాలుగా మారుతున్న సముద్రాలు ప్రక్షాళన చెందే దిశగా ఇదొక అడుగుగా భావించవచ్చు. ముట్టుకుంటే మెత్తగా అనిపించే, 1.3 సెంటిమీటర్లు (0.5 అంగుళాలు) మాత్రమే వుండే ఈ రొబోలు ఇప్పటికే పెద్దగా లోతులేని నీటిలో గల మైక్రోప్లాస్టిక్స్‌ను పీల్చుకున్నాయి.