Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : యూరోపియన్ కరెన్సీ యూరోను విలువలో అమెరికన్ డాలర్ దాటవేసింది. మాస్కో ఎక్సేంజీలో మంగళవారం రూబుల్తో పోల్చితే డాలర్ విలువ 58.70గా నమోదు కాగా.. యూరో విలువ 58.52కు తగ్గింది. డాలర్ కంటే యూరో విలువ తగ్గడం గడిచిన 20 ఏళ్లలో ఇదే తొలిసారి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు యూరో విలువ 12 శాతం పడిపోయింది. రష్యా-ఉక్రెయిన్ పరిణామాల నేపథ్యంలో చమురు ధరల పెరుగుదల యూరోపియన్ ఆర్థిక వ్యవస్థలను ఒత్తిడికి గురి చేశాయి. ఈ పరిణామం యూరో విలువపై ప్రతికూలతను చూపింది. మరోవైపు ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య పరపతి విధానాన్ని కఠినతరం చేయడం డాలర్‌కు కలిసి వచ్చిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.