Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొలంబో : శ్రీలంక తాత్కాలిక అధ్యక్షునిగా రణిల్ విక్రమసింఘే ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్ష పదవికి గొటబాయ రాజపక్స చేసిన రాజీనామాను ఆమోదించినట్టు పార్లమెంటు స్పీకర్ మహింద యాప అభయవర్దన శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. అనంతరం రణిల్ విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశారు. నూతన అధ్యక్షుడిని పార్లమెంటు ఎన్నుకునే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తర్వాత రానున్న ఏడు రోజుల్లో నూతన దేశాధ్యక్షుడిని ఎన్నుకోబోతున్నట్టు స్పీకర్ తెలిపారు. నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ఎంపీలకు అవకాశం కల్పించాలని ప్రజలను పార్లమెంటు స్పీకర్ కోరారు. ఈ ప్రక్రియ ఏడు రోజుల్లోగా పూర్తవుతుందని తెలిపారు. ఎంపీలు తమ ఆత్మప్రబోధం ప్రకారం స్వేచ్ఛగా వ్యవహరించేందుకు తగిన వాతావరణాన్ని కల్పించాలని కోరారు. నేటి (శనివారం) నుంచి శ్రీలంక పార్లమెంటు సమావేశా లు ప్రారంభం కానున్నట్టు స్పీకర్ ప్రకటించారు.
ఆందోళనకారులు ఆక్రమించుకున్న ప్రెసిడెన్షి యల్ సెక్రటేరియట్‌ను ఖాళీ చేసి, తిరిగి అధికారుల కు అప్పగించడంపై చర్చలు జరుగుతున్నాయి. దేశా ధ్యక్షుడు, ప్రధాన మంత్రి రాజీనామా చేయాలనే డి మాండ్‌తో నిరసనకారులు ప్రెసిడెంట్ హౌస్, ప్రెస ిడెన్షియల్ సెక్రటేరియట్, ప్రధాన మంత్రి అధికారిక నివాసాలను ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. గొటబయ రాజీనామాతో ప్రెసిడెంట్ హౌస్, పీఎం నివాసాలను నిరసనకారులు ఖాళీ చేశారు.