Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంపన్న దేశాల వైఖరిపై కరేబియన్ దేశాల విమర్శ
ట్రినిడాడ్: మంకీ పాక్స్ వ్యాక్సిన్ను వర్థమాన దేశాలకు ఇవ్వకుండా సంపన్న దేశాలు దాచేసుకుంటున్నాయని కరేబియన్ దేశాలు ధ్వజమెత్తాయి. బుధవారం వర్చువల్ విలేకరుల సమావేశంలో ట్రినిడాడ్ టొబాగో విదేశాంగ మంత్రి టెరెన్స్ డీయిల్సింగ్ మాట్లాడుతూ,మంకీపాక్స్ వ్యాక్సిన్ను ధనిక దేశాలు నిల్వ చేసుకోవడం వల్ల ట్రినిడాడ్,టొబాగో వంటి చిన్న దేశాలకు అవి అందుబాటులో లేకుండా పోతున్నా యని అన్నారు.కోవిడ్19 మహమ్మారి నుండి అంతర్జాతీయ సమాజం ఎలాంటి గుణపాఠం తీసుకోలేదనడా నికి ఇదొక నిదర్శనమని మంత్రి విమర్శించారు.మంకీపాక్స్ నిరోధక వ్యాక్సిన్లను అన్ని దేశాలకు సమాన స్థాయిలో అందుబాటులో ఉంచాలని డియల్ సింగ్ డిమాండ్ చేశారు. భారత్లో మొదటి మంకీ పాక్స్ కేసు కేరళలో ఇటీవల నమోదు అయింది. యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసొటాలోని అంటువ్యాధుల పరిశోధనా, విధాన రూపకల్పన కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచ వ్యాపితంగా ఇప్పటివరకు 10,857 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. వీరిలో మగ్గురు చనిపోయారు.