Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైనా ప్రతినిధి వ్యాఖ్య
బీజింగ్ : మధ్య ప్రాచ్యంలోని ప్రజలు ఆ ప్రాంతానికి యజమానులు, అంతేకానీ మధ్య ప్రాచ్యం ఎవరి సొత్తూ కాదు, శూన్యంగా పిలిచే స్థానాన్ని అలా వదిలివేయండి అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ వ్యాఖ్యానించారు. ''మధ్య ప్రాచ్యం అమెరికా ఆధిపత్యంలో కొనసాగగలదు. ఇజ్రాయిల్, అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా చైనా లేదా రష్యా భర్తీ చేసేలా శూన్యాన్ని సృష్టించదు.'' అని అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా మీడియా కోరగా వెన్బిన్ పై వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మధ్య ప్రాచ్యంలో ప్రశాంత పరిస్థితులు లేవు. కోవిడ్ కారణంగా ప్రాంతీయాభివృద్ధి వెనుకపట్టు పట్టింది. ఉక్రెయిన్ సంక్షోభం ప్రాంతీయ భద్రతను ప్రభావితం చేస్తూనే వుందని వాంగ్ అన్నారు. 'మధ్య ప్రాచ్య ప్రజలు కోరుకుంటోంది అభివృద్ధి, వారికి అత్యవసరంగా కావాల్సింది భద్రత' అని వ్యాఖ్యానించారు.