Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 24పాయింట్ల ఆధిక్యతతో లిజ్ ట్రస్
లండన్ : బ్రిటన్ నాయకత్వానికి జరుగుతున్న పోటీలో భారత సంతతికి చెందిన రిషిసునాక్ కన్నా విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ 24 పాయింట్ల ఆధిక్యతలో వున్నారు. గురువారం యువ్‌గవ్ పోల్ కన్జర్వేటివ్ పార్టీ సభ్యులకు నిర్వహించిన పోల్‌లో బ్రిటన్ తదుపరి ప్రధాని అయ్యే అవకాశాలు ట్రస్‌కే ఎక్కువ వున్నట్లు వెల్లడైంది. ఆర్థిక మంత్రిగా సునాక్ పన్ను విధానాలను ట్రస్ విమర్శిస్తున్నారు. ఈ మేరకు డైలీ మెయిల్‌కు రాసిన కాలమ్‌లో ఆమె పేర్కొన్నారు. గత 70ఏళ్ళలో ఎన్నడూ లేని విధంగా పన్నుల భారాన్ని మోపారని, పన్నుల విషయంలో దేశం తప్పుడు దారిలో నడిచేందుకు ఆయనే కారణమని విమర్శించారు. ఇటీవలి పన్ను పెంపులను తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఉసంహరిస్తానని ట్రస్ హామీనిచ్చారు. కాగా సునాక్ దీన్ని తోసిపుచ్చుతున్నారు. పార్టీలోని కిందిస్థాయి సభ్యులను తన వైపునకు తిప్పుకునేందుకు రిషి సునాక్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరో 18 మాసాల్లో జరగాల్సి వున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందగల సమర్ధుడైన అభ్యర్ధిని తానేనని చెప్పుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కెయిర్ స్టార్మర్, లేబర్ పార్టీలను దీటుగా ఎదుర్కొనగల వ్యక్తి ఎవరనుకుంటున్నారని డైలీ టెలిగ్రాఫ్‌కు రాసిన కాలమ్‌లో రిషి ప్రశ్నించారు. ఆ వ్యక్తిని తానేనని తాను విశ్వసిస్తున్నానని చెప్పారు. అయితే పార్టీ సభ్యుల్లో ఎక్కువమంది మితవాద ట్రస్ వైపే మొగ్గు చూపుతున్నారని సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో రిషికి ఈ ఎన్నిక సవాలుగానుంది.