Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రస్సెల్స్ : మంకీపాక్స్‌కు మశూచి వ్యాక్సిన్‌ను ఉపయోగించేందుకు యురోపియన్ కమిషన్ ఆమోదముద్ర వేసింది. ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధిపరిచిన డానిష్ ఔషధ సంస్థ సోమవారం ఈ మేరకు ప్రకటన చేసింది. మంకీపాక్స్‌ను అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. ఇప్పటివరకు మశూచికి ఉపయోగించిన వ్యాక్సిన్ ఇమ్వానెక్స్ను ఇకపై మంకీపాక్స్ నుంచి రక్షణకు ఉపయోగించడానికి కంపెనీకి మార్కెటింగ్ అధికారాన్ని ఇయు విస్తరించింది. ఇయు ఔషధ పర్యవేక్షక సంస్థ బవారియన్ నోర్డిక్ చేసిన సిఫార్సుకు అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. యురోపియన్ యూనియన్ సభ్య దేశాలకు, ఐస్లాండ్, లిచ్టెన్స్టెన్, నార్వేలకు కూడా ఈ ఆమోదముద్ర వర్తిస్తుంది. ప్రస్తుతం 72 దేశాల్లో 16వేల మందికి మంకీపాక్స్ సోకింది. మశూచి నివారణ కోసం 2013 నుంచి ఇయులో ఇమ్వానెక్స్కు ఆమోదం కొనసాగుతోంది. మంకీపాక్స్ వైరస్, మశూచి వైరస్ మధ్య పోలికలు వున్నందున ఈ వ్యాక్సిన్‌ను ఉపయోగించవచ్చని భావిస్తున్నారు.