Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా డాలర్ బలహీనం
వాషింగ్టన్ : అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగాయి. ఫ్యూచర్ మార్కెట్లో చమురు ధరలు అధికంగా ట్రేడింగ్ అవుతున్నాయి. న్యూయార్క్ మెర్కంటైల్ ఎక్సేంజీలో వచ్చే సెప్టెంబర్‌కు గాను ఒక్క బ్యారెల్‌పై చమురు ధరలు 2 అమెరికన్ డాలర్లు లేదా 2.1 శాతం పెరిగి 96.70 డాలర్లుగా నమోదయ్యింది. లండన్ ఐసీఈ ప్యూచర్ ఎక్సేంజీలో బ్యారెల్ ధర 1.9 శాతం పెరిగి 105.15 బిలియన్ డాలర్లుగా ట్రేడ్ అయ్యింది. అమెరికా డాలర్ విలువ తగ్గడంతో చమురు ధరల్లో పెరుగుదల చోటు చేసుకుంటుంది. ఇతర ప్రధాన కరెన్సీలతో పోల్చితే వరుసగా మూడో రోజూ డాలర్ విలువ తగ్గింది. సోమవారం సెషన్లో 0.23 శాతం బలహీనమైంది. సాధారణంగా అమెరికా డాలర్ విలువ తగ్గినప్పుడు చమురుకు డిమాండ్ పెరుగుతుంది. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో సెంట్రల్ బ్యాంక్ విధాన పరపతిని కఠినతరం చేయడంపై వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వు నిర్వహిస్తున్న రెండు రోజుల విధాన సమీక్ష బుధవారంతో ముగియనుంది. ఈ సమీక్షాలో కీలక వడ్డీ రేట్లను 75 బేసిస్ పాయింట్లు పెంచనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.