Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢాకా : నోబుల్ శాంతి బహుమతి గ్రహీత, మైక్రో ఫైనాన్స్ మార్గదర్శకుడు ముహమ్మద్ యూనస్‌పై బంగ్లాదేశ్ ప్రభుత్వం అవినీతి విచారణను ప్రారంభించింది. యూనస్ అధ్యక్షత వహించిన టెలికాం సంస్థలో అవినీతి జరిగినట్లు ఆరోపణలతో ఈ విచారణ ప్రారంభయింది. పేదరిక నిర్మూలనకు గాను అంతర్జాతీయ స్థాయిలో యూనస్‌కు పేరు వచ్చినా కార్మిక వివాదం, ప్రధానమంత్రి షేక్ హసీనాతో వివాదాల కారణంగా స్వదేశంలో అతని ప్రతిష్ట మసకబారింది. గ్రామీణ టెలికాం సంస్థలోని ఉద్యోగులకు ఉద్దేశించిన లాభాలను యూనస్‌తో సహా బోర్డు సభ్యులు దుర్వినియోగం చేసారనే ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించినట్లు బంగ్లాదేశ్ అవినీతి నిరోధక కమిషన్ తెలిపింది. అలాగే కార్మిక సంక్షేమ నిధికి చెందాల్సిన 6 మిలియన్ డాలర్లను బోర్టు సభ్యులు దొంగలించారని, మరో 315 మిలియన్ డాలర్లను మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి.