Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్థమాన దేశాల ఆర్థిక వ్యవస్థలు దిగాలు
- ప్రపంచ బ్యాంక్ రిపోర్ట్
వాషింగ్టన్ : ప్రస్తుత ఏడాదిలో వర్థమాన, అభివృద్థి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల వృద్థి రేటు 3.4 శాతానికి మందగించొచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ఇంతక్రితం ఏడాది 6.6 శాతం వృద్థి నమోద య్యింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు సహా ఇతర భౌగోలిక అంశాలు వర్థమాన దేశాలను ఒత్తిడికి గురి చేస్తున్నాయని ప్రపంచ బ్యాంక్ తన 'గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్'లో విశ్లేషించింది. వర్థమాన దేశాల్లో 2011-19 కాలంలో సగటున 4.8 శాతం వృద్థి చోటు చేసుకుందని పేర్కొంది. కాగా ఈ ఏడాది మాత్రం 3.4 శాతానికి పడిపోవడం ఆందోళనకరమేనని తెలిపింది. ''రష్యా- ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు ప్రపంచ వ్యాప్తంగా కమోడిటీ ధరల పెరుగుదలకు, హెచ్చు ముడి సరుకుల ధరలకు దోహదం చేశాయి. దీంతో అధిక ద్ర వ్యోల్బణ ఒత్తిడికి ప్రధాన కారణమయ్యాయి. మరోవైపు సూక్ష్మ గణం కాల మద్దతు కోసం కఠిన ఆర్థిక విధానాలకు దారి తీశాయి. అంతిమం గా గ్లోబల్ డిమాండ్‌ను దెబ్బతీశాయి.'' అని ఈ రిపోర్ట్ తెలిపింది.
భారత జీడీపీకి కోత..
రష్యా, ఉక్రెయిన్ యుద్ద పరిణామాలు ఊహించినదాని కంటే ఎక్కువ కాలం కొనసాగడంతో పాటుగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో భారత వృద్ధి రేటు అంచనాలకు ప్రపంచ బ్యాంక్ కోత పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థికవద్ధి అంచనాను 7.5 శాతానికి తగ్గించింది. వచ్చే 2023-24లో మరింత మందగించి 7.1 శాతానికే పరిమితం కావచ్చని విశ్లేషించింది. భారత జీడీపీ అంచ నాలను సవరించడం ఇది రెండో సారి. గడిచిన ఏప్రిల్‌లో 8.7 శాతం నుండి 8 శాతానికి తగ్గించింది. తాజాగా 7.5 శాతానికి అంచ నా వేసింది. దక్షిణాసియా రీజియన్‌లో 2021-22లో వృద్థి 5.7 శాతం గా ఉండగా.. ప్రస్తుతం 2022-23లో 4 శాతానికి పర మితం కావొచ్చని ఈ రిపోర్ట్ పేర్కొంది.