Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్యాంకాక్ : స్వదేశం నుంచి పారిపోయిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సా గురువారం థారులాండ్‌కు చేరుకున్నారని భావిస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. రాజపక్సాకు రాజకీయ ఆశ్రయం కోరే ఉద్దేశం లేదని, తాత్కాలికంగా మాత్రమే ఉంటారని పేర్కొన్నారు. రాజపక్సా విషయంపై థారులాండ్ ప్రధాని ప్రయత్ చాన్-ఓచా బుధవారం మాట్లాడుతూ 'ఇది మానవతా సమస్య, ఇది తాత్కాలిక బస మాత్రమే' అని చెప్పారు. రాజపక్సే థాయ్‌లాండ్‌లో ఉన్న సమయంలో ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనరని ఆయన తెలిపారు. రాజపక్సా పర్యటనకు ప్రస్తుత శ్రీలంక ప్రభుత్వం మద్దతు ఉందని, రాజపక్సా దౌత్య పాస్పోర్టుతో 90 రోజులు ఉండడానికి అవకాశం కల్పిస్తుందని థారులాండ్ విదేశాంగ మంత్రి డాన్ ప్రముద్వినై తెలిపారు. శ్రీలంకలో ప్రజల తిరుగుబాటుతో రాజపక్సా జులై 14న సింగపూర్ పారిపోయిన సంగతి తెలిసిందే.