Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టేజిపైనే కత్తిపోట్లు
- హెలికాప్టర్లో ఆస్పత్రికి తరలింపు
న్యూయార్క్ : భారత సంతతికి చెందిన ప్రముఖ బ్రిటిష్ నవలా రచయిత, బుకర్ ప్రైజ్ విజేత సల్మాన్ రష్దీపై దాడి జరిగింది. ఓ ఇన్స్టిట్యూట్లో ప్రసంగానికి సిద్ధమవుతుండగా.. ఆయన వైపు దూసుకొచ్చిన దుండగుడు స్టేజిపైనే కత్తితో దాడి చేయడం కలకలం రేపింది. అమెరికా న్యూయార్క్‌లోని చౌతాక్వా ప్రాంతంలోని ఓ ఇన్స్టిట్యూట్లో సమావేశానికి సల్మాన్ రష్దీ (75) హాజరయ్యారు. ఆయన ప్రసంగానికి సిద్ధమవుతున్న క్రమంలోనే స్టేజిపైకి దూసుకొచ్చిన ఓ దుండగుడు కత్తితో మెడపై దాడికి పాల్పడినట్టు తెలుస్తున్నది. కత్తి పోట్లకు గురైన రష్దీ అక్కడిక్కడే కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే ఆయన్ను హెలికాప్టర్లో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని న్యూయార్క్ పోలీసులు వెల్లడించారు. 1947లో ముంబయిలో జన్మించిన సల్మాన్ రష్దీ.. కొన్నాళ్ల తర్వాత బ్రిటన్‌కు వెళ్లారు. రష్దీ రచించిన మిడ్నైట్ చిల్డ్రన్ నవలకు 1981లో ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ లభించింది. అయితే ఆయన రచించిన పలు నవలలు వివాదాస్పదయ్యాయి.