Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా తెగతెంపులు : రష్యా
మాస్కో : అమెరికా సహా ఇతర దేశాల్లో రష్యా ఆస్తుల్ని సీజ్ చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని రష్యా హెచ్చరించింది. ఉక్రెయిన్ సంక్షోభాన్ని సాకుగా తీసుకొని రష్యాపై అమెరికా ఆంక్షలకు దిగితే..తగినరీతిలో సమాధానం చెబుతామని పుతిన్ ప్రభుత్వం ప్రకటించింది. వాషింగ్టన్తో ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిస్థాయిలో తెగతెంపులు చేసుకుంటామని శనివారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్ సంక్షోభంలో అమెరికా ప్రమేయం రోజు రోజుకీ మితిమీరిపోతోందని కెనడాలో రష్యా రాయబారి అలెగ్జాండర్ దర్చీవ్ అన్నారు. ''అమెరికా చర్యలు అత్యంత ప్రమాదకర పరిణామాలకు దారితీస్తాయని చెప్పగలను. ఆస్తుల్ని సీజ్ చేస్తే వాషింగ్టన్-మాస్కో మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. అలా జరగాలని రష్యా కోరుకోవటం లేదు'' అని చెప్పారు. ఉక్రెయిన్పై ప్రత్యేక సైనిక చర్యను చేపడుతున్నట్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో అధ్యక్షుడు పుతిన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా ప్రమేయం మితిమీరిపోయిందని రష్యా మరోమారు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ యుద్ధంలో ప్రధాన ప్రత్యర్థులుగా అమెరికన్లు మారారని అలెగ్జాండర్ దర్చీవ్ వ్యాఖ్యానించటం కలకలం రేపాయి.