Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శాన్ఫ్రాన్సిస్కో : ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మాంద్యం కారణంగా ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ తమ ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది. పనితీరు మెరుగుపర్చుకోవాలని, తదుపరి త్రైమాసిక ఆదాయాలపై పూర్తిస్థాయి పరిశీలన ఉంటుందని, పురోగతి లేకపోతే వీధినపడతారని గూగుల్ ఎగ్జిక్యూటివ్‌లు హెచ్చరించినట్టు సమాచారం. కంపెనీలో అంతర్గతంగా సేల్స్ టీమ్‌కు వచ్చిన సందేశంలో ఈ విషయాన్ని పేర్కొన్నట్టు తెలిసింది. నెల రోజుల నుంచి గూగుల్‌లో కొత్త నియామాకాలు లేకపోవడంతో 'తొలగింపులు' ఉంటాయని ఉద్యోగులు భయపడుతున్నారు. అందుకు తగ్గట్లుగానే తాజాగా సంస్థ హెచ్చరించింది. గత నెల చివరిలో గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్ ఉద్యోగులతో మాట్లాడుతూ ఇదే విధమైన హెచ్చరికలు చేశారు.