Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాన్బెర్రా : ఆస్ట్రేలియాలోని కాన్బెర్రా ఎయిర్‌పోర్ట్‌లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. చెక్ ఇన్ ఏరియాలో ఓ సాయుధుడు కాల్పులకు తెగబడ్డాడు. ఐదు రౌండ్ల కాల్పులు జరపడంతో ఎయిర్ పోర్టు సిబ్బంది, ప్రయాణీకులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. సిసిటివి ఫుటేజ్‌లను పరిశీలించిన అధికారులు.. ఈ ఘటనకు ఒక్కడే కారణమని నిర్ధారించారు. ప్రధాన టెర్మినల్ బిల్డింగ్ వద్ద కాల్పులు జరిగినట్లు సమాచారం అందిన నేపథ్యంలో మధ్యాహ్నం 1.30 గంటలకు విమానాశ్రయానికి చేరుకున్నట్లు ఎసిటి పోలిసింగ్ ధ్రువీకరించింది. అయితే ఎవ్వరికీ ఎటువంటి గాయాలు కాలేదని పేర్కొంది. ప్రస్తుతం ఆ ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేశారు.