Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రిగా విదేశాంగ మంత్రి లిజ్ ట్రూస్ ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని పోలింగ్ సంస్థ ఓపినియం రీసెర్చ్ చేసిన సర్వే వెల్లడించింది. మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ కంటే లిజ్ ట్రూస్ 22 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నట్లు సర్వే తెలిపింది. గతవారంలో నిర్వహించిన ఈ సర్వే ప్రకారం 570 మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల్లో 61 శాతం మంది లిజ్ ట్రూస్ ఓటు వేస్తామని,, 39 శాతం మంది రిషి సునాక్కు ఓటు వేస్తామని చెప్పినట్లు సర్వే తెలిపింది. ఈ సర్వే వివరాలను శనివారం ప్రచురించారు.