Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్ : దుండగుడి చేతిలో కత్తిపోట్ల దాడికి గురైన ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ ఆరోగ్య స్థితి కొంచెం మెరుగయింది. దాడి తరువాత వెంటిలేటర్‌తో చికిత్స అందిస్తున్న సల్మాన్ రష్దీకి ప్రస్తుతం వెంటిలేటర్ తొలగించారు. మాట్లాడగలుగుతున్నారని రష్దీ ఏజెంట్ అండ్రూ వైలీ వెల్లడించారు. తదుపరి వివరాలు చెప్పడానికి ఆయన నిరాకరించారు. 'రష్దీకు వెంటిలేటర్ తొలగించాం. మాట్లాడగలుగుతున్నారు' అని వైలీ చెప్పారు. 75 ఏళ్ల రష్దీకి ఈ దాడి కారణంగా కాలేయం, ఇతర నరాలు, కంటిపై తీవ్ర గాయలయ్యాయి. దీంతో అతను ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు.
కాగా, రష్దీపై దాడికి పాల్పడ్డ హదీ మాటర్ తన నేరాన్ని అంగీకరించడం లేదు. విచారణ కోసం పశ్చిమ న్యూయార్క్‌లోని కోర్టుకు నిందితుడ్ని పోలీసులు తీసుకొచ్చారు. నిందితుడు నలుపు-తెలుపుల జంప్ సూట్ ధరించి, ముఖానికి తెల్లటి మాస్క్ ధరించాడు. రష్దీపై దాడి ప్రణాళిక ప్రకారం జరిగిందేనని పోలీసులు కోర్టులో వాదించారు.