Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డు ప్రమాదంలో 20మంది సజీవ దహనం
- ఆరుగురికి తీవ్ర గాయాలు
ఇస్లామాబాద్: ఆయిల్ ట్యాంకర్, బస్సు ఢకొీన్న ఘటనలో 20 మంది సజీవ దహనమైన విషాద సంఘటన పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రం ముల్తాన్లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రయాణికులతో లాహోర్ నుంచి కరాచీకి హైవేపై వెళ్తున్న బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢ కొన్నాయి. ఆయిల్ ట్యాంకర్ నుంచి పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో రెండు వాహనాలు దగ్ధమయ్యాయి. మంటల నుంచి తప్పించుకునేందుకు ప్రయాణికులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. హాహాకారాలు చేస్తూనే మంటల్లో కాలిపోయారు. సమాచారం అందిన వెంటనే అధికారులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అతికష్టం మీద అదుపు చేశారు. తీవ్ర గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. అనేక మతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని, డీఎన్ఏ పరీక్షల ఆధారంగానే వారిని నిర్ధారించాల్సి ఉంటుందని అధికారి వెల్లడించారు. ఈ ప్రమాదంపై పంజాబ్ ముఖ్యమంత్రి పర్వేజ్ ఎలాహీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మతులను గుర్తించి, మతదేహాలు వారి కుటుంబసభ్యులకు త్వరగా అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పాకిస్థాన్లో శనివారం సైతం ఇదే తరహా ప్రమాదం జరిగింది. ఓ బస్సు, ట్రక్కు ఢకొన్న ప్రమాదంలో 13మంది మరణించారు.