Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సల్మాన్ రష్డీకి మద్దతుగా న్యూయార్క్‌లో సంఘీభావ ర్యాలీ
వాషింగ్టన్ : ఆంగ్ల నవలా రచయిత సల్మాన్ రష్డీపై జరిగిన దాడిని నిరసిస్తూ ఆయన మద్దతుదారులు, స్నేహితులు, రచయితలు శుక్రవారం న్యూయార్క్‌లో సంఘీభావ ర్యాలీ చేపట్టారు. రచయితగా ఆయన చేసిన కృషిని కొనియాడుతూ మన్‌హటన్‌లోని న్యూయార్క్ పబ్లిక్ లైబ్రరీ సెంట్రల్ బ్రాంచ్ మెట్లపై వక్తలంతా మాట్లాడారు. భావ వ్యక్తీకరణకు, వాక్ స్వాతంత్య్రానికి ఆయన రచనలు ప్రాధాన్యతనిచ్చాయని, దుండగుడి దాడి నుంచి సల్మాన్ రష్డీ త్వరగా కోలుకోవాలని వక్తలంతా కోరుకున్నారు. రష్డీ రచనల్లో కొన్ని కీలకభాగాల్ని వక్తలు చదవి వినిపించారు. కొద్ది రోజుల క్రితం సల్మాన్రష్డీపై ఒక దుండగుడు విచక్షణా రహితంగా కత్తితో దాడికి తెగబడిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన రష్డీ ప్రస్తుతం హాస్పిటల్లో వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి కాస్త మెరుగుపడిందని సల్మాన్ రష్డీ ఏజెంట్ ఆండ్రూ వైలీ చెప్పారు. పాల్ ఆస్టర్, గే టేలీస్, జెఫ్రీ యూజెనిడెస్, కిరణ్ దేశారు వంటి ప్రముఖ రచయితలు ర్యాలీలో పాల్గొన్నారు. వాక్ స్వాతంత్య్రం, స్వేచ్ఛకు చిహ్నంగా నిలిచిన ఆయన రచనల్లో అంశాల్ని జ్ఞాపకాలను వారు పంచుకున్నారు.