Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ద్వైపాక్షిక సంబంధాల పటిష్టతకు మరింత కృషి
- ఇరు దేశాల నిర్ణయం
హవానా: క్యూబా, రష్యా దౌత్య సంబంధాల 120వ వార్షికోత్సవాలను కలసికట్టుగా నిర్వహించాలని ఈ రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి. విభిన్న రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం గావించే దిశగా ముందుకు సాగాలని రష్యాలో క్యూబా రాయబారి జులియో గార్మెండియా చెప్పారు. ఇటీవల కాలంలో క్యూబా అత్యంత సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్న సమయంలోను, ఇతర అన్ని సందర్భాల్లోను రష్యన్ ప్రభుత్వం, ప్రజలు తమకు అండగా నిలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇంధనం, రవాణా, బయో టెక్నాలజీ వంటి వ్యూహాత్మక రంగాల్లో ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టుల్లో రష్యా కీలక పాత్ర పోషించిందని ఆయన తెలిపారు. ఈ ఏడాది జనవరిలో రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్, క్యూబా అధ్యక్షుడు డియాజ్ కానెల్ ఫోన్లో జరిపిన సంభాషణలో క్యూబా పట్ల అమెరికా అనుసరిస్తున్న విధానాన్ని తిరస్కరించారు. అది విధించిన ఆర్థిక, వాణిజ్య, ద్రవ్య దిగ్బంధనం అంతర్జాతీయ సంబంధాలను ప్రమాదంలో పడేస్తున్నదని ఈ ఇరువురు నేతలు అభిప్రాయపడినట్లు గార్మెండియా తెలిపారు. రష్యా- క్యూబన్ సహకారంలో భాగంగా 200 మెగాబాట్ల థెర్మో ఎలక్రిటక్ బ్లాక్లను ఏర్పాటు చేయబోతున్నట్టు ఆయన తెలిపారు.