Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇరాన్ విదేశాంగ మంత్రి విమర్శ
టెహ్రాన్: పాశ్చాత్య దేశాల మతిమాలిన ఆంక్షల విధానం విఫమైందని, అవి విధించిన ఆంక్షలను లెక్కచేయకుండా దేశాలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేని అమీర్ అబ్దోలాహియాన్ పేర్కొన్నారు. మంగళవారం. ఆఫ్రికన్ దేశమైన మాలి రాజధాని బమాకోలో ఇరాన్- మాలి సంయుక్త ఆర్థిక సంఘం తొలి సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇస్లామిక్ విప్లవం (1979) విజయం సాధించాక ఏళ్ల తరబడి ఈ పర్షియన్ దేశంపై అమెరికా, కొన్ని పాశ్చాత్య దేశాలు ఆంక్షలు మీద ఆంక్షలు విధించాయని అన్నారు. వాటన్నిటిని అధిగమించి ఇరాన్ ముందుకు సాగుతోందన్నారు. ఈ విషయంలో ఇరాన్ అనుభవాలు మాలికి ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. మాలిపై పశ్చిమ దేశాల ఆంక్షలను ఆయన దుయ్యబట్టారు. ప్రజల కష్టాలను మరింత పెంచడానికే తప్ప, సమస్య పరిష్కారానికి అవి ఏ విధంగాను ఉపయోగపడవని అన్నారు.
మాలితో సహకార సంబంధాలను మరింత పటిష్టపరచుకోడానికి ఇరాన్ ఎల్లప్పుడూ పాటుపడుతుందని ఆయన అన్నారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఆఫ్రికా పట్ల చూపుతున్న నిబద్ధతను మాలియన్ విదేశాంగ మంత్రి. ప్రశంసించారు. చాలా దేశాలు తమ స్వంత ప్రయోజనాల కోసం ఆఫ్రికాపై ఆసక్తి కలిగి ఉన్నాయి, కానీ ఇరాన్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని అన్నారు.