Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : తైవాన్‌కు 110కోట్ల డాలర్ల విలువ చేసే ఆయుధాల అమ్మకాలకు ఆమోద ముద్ర వేయాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాంగ్రెస్‌ను కోరనున్నారు. ఈ ఆయుధాల్లో 60 నౌక విధ్వంసక క్షిపణులు, గాల్లో నుంచి గాల్లోకి ప్రయోగించగల వంద క్షిపణులు ఉన్నాయని పొలిటికో విడుదల చేసిన ఒక నివేదిక తెలిపింది. మరోపక్క తైవాన్ జలసంధిలో ప్రయాణిస్తున్న రెండు అమెరికా యుద్ధ నౌక కదలికలను చైనా నావికాదళం నిశితంగా గమనిస్తోంది. ప్రస్తుతానికి పరిస్థితులన్నీ అదుపులోనే ఉన్నాయని, ఈస్ట్రన్ థియేటర్ కమాండ్ (ఈటీసీ) మొత్తంగా సెక్యూరిటీ ట్రాకింగ్ నిర్వహిస్తోందని చైనా సైన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. తైవాన్ జలసంధిలో 2012 నుంచి ఇప్పటివరకు వందకు పైగా అమెరికా యుద్ధ నౌకలు ప్రయాణించాయని మీడియా తెలిపింది.