Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : బ్రిటన్ మహారాణిగా సుదీర్ఘకాలం పాలించి గురువారం కన్నుమూసిన ఎలిజబెత్-2 స్థానంలో ఆమె కుమారుడు చార్లెస్ రాజు కానున్నారు. ఈ మేరకు శనివారం యాక్సెషన్ కౌన్సిల్ సమావేశంలో అధికారికంగా ప్రకటన వెలువడనుందని బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రకటించింది. వారసుడిని ప్రకటించడానికి అధికార నివాసమైన సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో ఉదయం 10గంటలకుకౌన్సిల్ సమావేశం కానుంది. అనంతరం ముగ్గురు ట్రంపెటర్లు వాయిస్తుండగా, రాజు సింహాసనాన్ని అధిష్టించిన విషయాన్ని సెయింట్ జేమ్స్ ప్యాలెస్ నుంచి ప్రకటిస్తారు. ఆ తర్వాత చార్లెస్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. రెండోసారి లండన్‌లో రాయల్ ఎక్స్ఛేంజ్లో ఈ ప్రకటన చదువుతారు. అటుపై స్కాట్లాండ్, ఐర్లాండ్, వేల్స్‌ల్లో ఆదివారం మధ్యాహుం చదివి వినిపిస్తారు. కొత్త రాజును ప్రకటించిన సందర్భాన్ని పురస్కరించుకుని జాతీయ పతాకాలను పూర్తి స్థాయిలో ఎగురవేసి, ఆ తర్వాత రాణి మతికి సంతాప సూచకంగా సగానికి అవనతం చేస్తారు. రాణి ఎలిజబెత్ మతికి సంతాప సూచకంగా బ్రిటీష్ ప్రభుత్వం సంతాప దినాలు ప్రకటించింది. స్కాటిష్ ఎస్టేట్ నుండి లండన్‌కి తిరిగివచ్చిన చార్లెస్ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. స్కాటిష్ ఎస్టేట్ నుంచి చార్లెస్ దంపతులు లండన్ చేరుకున్నారు.