Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో ఇటీవల కనివినీ ఎరుగని రీతిలో సంభవించిన వరదల వల్ల జరిగిన ఆర్థిక నష్టం దాదాపు 1800 కోట్ల డాలర్లుగా వుంటుందని అంచనా వేశారు. అంతకుముందు అంచనాల ప్రకారం 1250కోట్ల డాలర్లుగా నష్టాన్ని లెక్కించారు. తాజాగా వస్తున్న సమాచారంతో నష్టం భారీగా పెరుగుతోంది. వరదల కారణంగా అత్యదికంగా నష్టపోయింది వ్యవసాయ రంగమే, 80.25 లక్షల ఎకరాల్లోని పంటలు పూర్తిగా నాశనమయ్యా యని ది న్యూస్ ఇంటర్నేషనల్ పేర్కొంది. గతంలో అంచనాల ప్రకారం 42లక్షల ఎకరాల్లోని పంటే దెబ్బతిందని భావించారు. అన్ని వర్గాల నుండి వచ్చిన సమాచారంతో ఆ లెక్కలు రెట్టింపయ్యాయి. పత్తి, వరి, ఇంకా చిన్న పంటలు చాలా తీవ్రంగా దెబ్బ తిన్నాయి. నీట మునిగిన పొలాల నుండి తక్షణమే పూర్తిగా నీటిని తొలగించని పక్షంలో గోధుమ సాగుకు తీవ్రమైన ఇబ్బందులు కలుగుతాయి. ఇప్ప టికే దేశంలోని పలు ప్రాంతాల్లో పత్తి పంట పూర్తిగా నాశనమైంది. ఇప్పుడు గోధుమ పంట కూడా ప్రమాదంలో పడింది. రాబోయే పంటకు కనీస మద్దతు ధరను పెంచేందుకు జాతీయ ఆహార భద్రతా మంత్రిత్వశాఖ కసరత్తు చేస్తోంది. అంతర్జాతీ య దాతలతో పాక్ అధికారులు చర్చలు జరుపుతు న్నారు. వరదల కారణంగా సంభవించిన ఆర్థిక నష్టాలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జిడిపి వృద్ధి రేటు ఐదు శాతంగా వుంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. తలసరి ఆదాయం కూడా తగ్గుతు ందని అంచనా. తాజా పరిస్థితులతో దారిద్య్రం, నిరుద్యోగం పెచ్చరిల్లుతుందని ఆందోళన వ్యక్తమవు తోంది.