Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాలకు మించి పెరగడంతో అక్కడి కార్పొరేట్ దిగ్గజాల మార్కెట్ కాపిటలైజేషన్కు ఎసరు పడుతోంది. ఒక్క పూటలోనే లక్షల కోట్ల సంపద ఆవిరయ్యింది. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ సూచీ గణాంకాల ప్రకారం.. మంగళవారం ఒక్కరోజే అమెరికా బిలియనీర్ల సంపద ఏకంగా 93 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.7.3లక్షల కోట్లు) ఆవిరయ్యింది. అమెరికా మార్కెట్ చరిత్రలోనే బిలియనీర్లకు ఇది తొమ్మిదో అతిపెద్ద రోజువారీ నష్టం కావడం విశేషం. అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ అత్యధికంగా 9.8 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.77వేల కోట్లు) మేర నష్టపోయారు. స్పేస్ఎక్స్ ఎలాన్ మస్క్ సంపద 8.4 బిలియన్ డాలర్లు (రూ.66వేల కోట్లు) ఆవిరయ్యింది. మెటా సిఇఒ మార్క్ జుకర్బర్గ్, గూగుల్ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్, మైక్రోసాఫ్ట్ మాజీ సిఇఒ స్టీవ్ బాల్మెర్ తదితరుల సంపద 4 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.32వేల కోట్లు) చొప్పున నష్టపోయారు.