Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్
సమర్కండ్ : ప్రపంచ అగ్ర దేశాలుగా కీలకమైన విషయాల్లో కలిసి పనిచేయడానికి చైనా, రష్యాలు సుముఖత వ్యక్తం చేశాయి. షాంఘై సహకార సంస్థ 22వ సదస్సు సందర్భంగా గురువారం రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్‌తో జరిగిన సమావేశంలో జిన్‌పింగ్ మాట్లాడారు. కీలక ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో పరస్పరం మద్దతిచ్చుకోవడానికి, సహకరించుకోవడానికి, రష్యాతో కలిసి పని చేయడానికి సిద్ధంగా వున్నట్లు చైనా అధ్యక్షులు జిన్‌పింగ్ చెప్పారు. వాణిజ్యం, వ్యవసాయం, అనుసంథానత వంటి రంగాల్లో ఆచరణత్మాక సహకరాన్ని మరింత పెంపొందించేందుకు కూడా చైనా సుముఖంగా వుందన్నారు. షాంఘై సహకార సంస్థ పరిధిలో, ఆసియాలో విశ్వాస పునరుద్ధరణ చర్యలపై సమావేశంలో, బ్రిక్స్‌లో, ఇతర బహుళపక్ష వేదికలపై సంఘీ భావాన్ని పెంచుకునేందుకు,సంబంధిత పక్షాల మధ్య పరస్పర విశ్వాసా న్ని పెంచేందుకు ఇరుపక్షాలు సమన్వయాన్ని మరింత బలోపేతం చేసు కోవాలని జిన్‌పింగ్ పిలుపిచ్చారు.చైనా, రష్యాలు ఆచరణాత్మక సహ కారాన్ని మరింత విస్తరించుకోవాలని, వర్ధమాన దేశాల్లో, ప్రాంతీ య భద్రతా ప్రయోజనాలను కాపాడుకునేందుకు కృషి చేయాలని కోరారు.