Authorization
Mon Jan 19, 2015 06:51 pm
షాంఘై: షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఉజ్బెకిస్థాన్ చేరుకున్నారు. ఆయన రాగానే ఉజ్బెకిస్థాన్ ప్రధాని అబ్దుల్లా అరిఫోవ్, మంత్రులు, సమర్కాండ్ గవర్నర్, సీనియర్ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. రేపు ఉదయం ప్రధాని సమ్మిట్లో పాల్గొంటారు. శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యే ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడితో పాటు మరికొందరు నేతలతో కూడా ఆయన ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు.