Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాస్కో : రష్యా అధ్యక్షులు వ్లాదిమర్ పుతిన్‌పై హత్యాయత్నం జరిగినట్లు పలు మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. పుతిన్ ప్రయాణిస్తున్న కారుపై బాంబు దాడి జరిగిందని యూరో వ్లీక్లీ న్యూస్ జివిఆర్ టెలిగ్రామ్ చానెల్ బుధవారం ఒక కథనాన్ని వెల్లడించింది. ఈ ప్రమాదం నుంచి పుతిన్ సురక్షితంగా బయటపడ్డారని వెల్లడించింది. అయితే ఈ ప్రమాదం ఎప్పుడు జరిగిందో చెప్పలేదు. పుతిన్ తన నివాసానికి తిరిగివస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు ముందువైపు ఉన్న ఎడమ చక్రం భారీ శబ్ధంతో పేలిందని, దీంతో అప్రమత్తమైన సిబ్బంది కారు నుంచి పొగలు వస్తున్నప్పటికీ వాహనాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారని ఆ వార్తా సంస్థ తెలిపింది. తరువాత మరో బ్యాక్‌ఆప్ కాన్వారులో పుతిన్‌ను అధ్యక్ష నివాసానికి తీసుకునివెళ్లారని చెప్పింది. పుతిన్‌పై హత్యాయత్నం జరగడం ఇదే మొదటిసారి కాదు. తాను కనీసం ఐదు హత్యాయత్నాల నుంచి బయటపడ్డానని గతంలో పుతిన్ స్వయంగా వెల్లడించారు.