Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లక్షలాదిమంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు
టోక్యో : నన్మదోల్ తుపాను దక్షిణ జపాన్ను అతలాకుతలం చేసింది. దేశానికి నైరుతి దిశగా కుయుషు ప్రాంతంలోని కగొషియా నగరం వద్ద ఆదివారం రాత్రి తుపాను తీరాన్ని దాటడంతో బలమైన ఈదురు గాలులు, భారీ వర్షాలతో పరిస్థితి బీభత్సంగా మారింది. గాలుల ధాటికి మహా వృక్షాలు సైతం నేలకూలాయి. నదులు ఏ క్షణమైనా పొంగి పొర్లేలా వున్నాయి. దీంతో లక్షలాదిమంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటివరకు ఇద్దరు మరణిం చగా, 60మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. సాధారణంగా సెప్టెంబరు మాసంలో కురిసే వర్షాల కన్నా అనేక రెట్ల వర్షం గత 24గంటల్లో కురిసిందని, ఈ పరిస్థితుల్లో చాలా స్వల్పంగా వర్షం పడినా నదుల్లో నీటి మట్టాలు పెరిగి పొంగిపొర్లే పరిస్థితులు న్నాయని హెచ్చరించారు. కొండచరియలు విరిగిపడే అవకాశము న్నందున ప్రజలు అప్రమత్తంగా వుండాలని కోరారు.