Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జుట్టుని కత్తిరిస్తూ.. హిజాబ్‌ని తగులబెడుతూ మహిళల నిరసన
టెహ్రాన్:హిజాబ్‌కి వ్యతిరే కంగా ఇరాన్లో ఆందోళనలు వెల్లువెత్తు తున్నాయి. మహ్సా అమ్నీ (22) అనే మహిళ మృతితో ఇరాన్లో నిరసన లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఆదివారం పలువురు ఇరాన్ మహిళలు తమ హిజాబ్‌లను బహిరంగంగా తీసివేసి తగులబెట్టి నిరసన తెలిపారు. హిజాబ్ ధరించలేదంటూ మహ్సా అమ్నీ అనే మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల కస్టడీ అనంతరం ఆమె కోమాలోకి వెళ్లి మరణించింది. పోలీసులు తీవ్రంగా కొట్టడంతోనే మరణించినట్టు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ మహిళ లు నిరసనలు తెలుపుతున్న వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. హిజాబ్ ధరించలేదంటూ పోలీసులు మహ్‌సాను హత్య చేసినందుకు నిరసనగా ఇరాన్ మహిళలు జుట్టును కత్తిరించుకోవడం, హిజాబ్‌లను తగులబెట్టడం ద్వారా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నా రంటూ ఇరాన్ జర్నలిస్ట్, కార్యకర్త మాసిV్‌ా అలినెజాద్ ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఏడేండ్ల నుంచి హిజాబ్ ధరించాలని వేధిస్తున్నారనీ, లేకపోతే పాఠశాలకు వెళ్లలేమనీ, ఉద్యోగాన్ని పొందలేమనీ, ఈ లింగ వివక్షతతో కూడిన పాలనతో తాము విసిగిపోయామని ఆగ్రహం వ్యక్తంచేశారు. సక్వెజ్లోని భద్రతా దళాలు మహ్సా అమ్ని అంత్యక్రియల అనంతరం నిరసనకారులపై కాల్పులు జరిపారని, ఈ కాల్పుల్లో పలువురు మహిళలు గాయపడ్డారని.. ఇరాన్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమిదని దుయ్యబట్టారు. పోలీసులు మొదట 22 ఏండ్ల మహిళను చంపారనీ, ఇప్పుడు నిరసన తెలుపుతున్న మహిళలపై తుపాకులు, టియర్‌గ్యాస్ ప్రయోగించారని మరో ట్వీట్లో ఆరోపించారు. ఇరాన్‌లోని షరియా (ఇస్లామిక్ చట్టం) ప్రకారం.. మహిళలు హిజాబ్ ధరించడంతో పాటు బురఖా ధరించాలి. లేదంటే జరిమానాలు, అరెస్టులు ఎదుర్కోవాల్సి వుంది.