Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబ్ల్యుహెచ్ఓ స్పష్టీకరణ
స్విట్జర్లాండ్: కోవిడ్ మహమ్మారి ఇప్పటికీ అంతర్జాతీయ అత్యవసర సమస్యగానే కొనసాగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పష్టం చేసింది. ఇక 'కోవిడ్ కాలం ముగిసింది' అంటూ ఆదివారం మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ పై ప్రకటన చేసింది. మంగళవారం జరిగిన ఒక పత్రికా సమావేశంలో డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి మాట్లాడుతూ, కోవిడ్ భయం ఇక లేదని భావించరాదనీ, ఇప్పటికీ దాన్ని అంతర్జాతీయ సమస్యగానే చూడాల్సి వుందని హెచ్చరించారు. అయితే దేశాలన్నీ కూడా తమకు అందు బాటులో వున్న పరిష్కార మార్గాలన్నింటినీ సక్రమంగా అమలు చేసిన పుడే ఈ మహమ్మారిని మనం అంతమొందించగలమని అన్నారు.