Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అమెరికాలోని భారత రాయబార కార్యాలయాన్ని సందర్శించారు. భారత్‌లో డిజిటలై జేషన్ యత్నాలను మరింత విస్తరించేందుకు గల అవకాశాలపై చర్చిం చినట్టు తెలుస్తున్నది. భారత్‌లో డిజిటల్ చెల్లింపులు, మౌలిక సదు పాయాల డిజిటలైజేషన్‌తో పాటు విద్యారంగంలో గూగుల్ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే అవకాశాలపై చర్చించినట్టు సమాచారం. దేశంలోని టెక్ కంపెనీ కార్యకలాపాలకి సంబంధించిన అంశాలు, ముఖ్యంగా డిజిటలైజేషన్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పిచాయ్ భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధుతో భేటీ అయ్యారు. గతవారం చివరలో స్థానిక డిసిలోని భారత రాయబార కార్యాలయాన్ని సందర్శించారు. భారత రాయబార కార్యాలయాన్ని పిచాయ్ సందర్శించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. భారత రాయబారి సంధుతో జరిగిన గొప్ప సంభాషణకు ధన్యవాదాలు అని ట్విటర్లో పేర్కొన్నారు. భారత్‌పట్ల గూగుల్‌కున్న నిబద్ధత గురించి తెలిపేందుకు అవకాశం కల్పించినందుకు ప్రశంసించారు. భారతదేశ డిజిటల్ భవిష్యత్తు కోసం తమ మద్దతును కొనసాగించడానికి ఎదురుచూస్తున్నామని అన్నారు. భారత్- అమెరికాల మధ్య వాణిజ్యం, సాంకేతికతతో పాటు గూగుల్‌తో టెక్ భాగస్వామ్య విస్తరణపై పరస్పరం చర్చలు జరిపామని భారత రాయబారి సంధు తెలిపారు. పిచాయ్ నేతృత్వంలో గూగుల్ భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. యువతకు శిక్షణతో పాటు అనేక రంగాలలో తనదైన ముద్ర వేసేందుకు యత్నిస్తోంది. భారత్ డిజిటలైజేషన్ కోసం గూగుల్ సుమారు 10 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించింది. రిలయన్స్ జియోతో పాటు భారతి ఎయిర్‌టెల్‌తో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్‌తో పాటు జాతీయ డిజిటల్ అక్షరాస్యత మిషన్‌పై భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోంది.