Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్ : నాణ్యమైన విద్య పొందటం ప్రతి ఒక్కరి హక్కు అని, దీనిని పరిరక్షించాల్సిన బాధ్యత పాలకులపై ఉందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ అన్నారు. ముఖ్యంగా బాలికలు నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. మంగళవారం జిన్హువా న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ, ''పాఠశాల విద్య అందరికీ అందుబాటులోకి రావాలి. ఎలాంటి వివక్షకూ తావివ్వకూడదు. కరోనా మహమ్మారి కారణంగా విద్యారంగం ఎంతో నష్టపోయింది. దీనిని నుండి బయటపడాలి. బాలికల ఉన్నత విద్యపై ఆంక్షల్ని ఎత్తేయాలని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ వర్గాల్ని కోరుతున్నా. ఎక్కడైనా శాంతిభద్రతలు, స్థిరమైన భద్రత ఏర్పడాలంటే బాలికల ఉన్నత విద్య అత్యంత ముఖ్యమైనది. విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులది కీలకమైన పాత్ర. కేవలం ప్రశ్నలు, సమాధానాలతో విద్యా బోధన పూర్తికాదు'' అని చెప్పారు. పాఠశాల ఆవరణలో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొనాలని, హింసకు తావివ్వరాదని గుటెర్రస్ అన్నారు.