Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇరాన్లో 8కి చేరిన మృతుల సంఖ్య
- ఇంటర్నెట్ బంద్
టెహ్రీన్: హిజాబ్ వ్యతి రేక ఆందోళనల్లో మృతుల సంఖ్య 8కి చేరినట్టు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో సోషల్‌మీడియాపై ఆంక్షలు విధించింది. ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. హిజాబ్ ధరించలేదంటూ ఇరానియన్ కుర్ధిస్థాన్కు చెందిన 22 ఏళ్ల మహిళ మాహ్సా అమ్ని పోలీసుల కస్టడీలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను వ్యతిరేకిస్తూ గత ఐదు రోజులుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. గడిచిన రెండు రోజుల్లో నలుగురు మరణించగా, మొత్తం మరణాల సంఖ్య ఎనిమిదికి చేరినట్టు స్థానిక మీడియా, పోలీసులు తెలిపారు. ఇరాన్‌లోని కుర్దిష్‌లు అధికంగా కలిగిన వాయువ్య ప్రాంతంలో ప్రారంభమైన నిరసనలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. 2019 గ్యాసోలీన్ ధరల పెరుగుదలపై చేపట్టిన నిరసనల తర్వాత ఇవే అతిపెద్ద నిరసనలని మీడియా వెల్లడించింది. ఇంధన ధరల పెరుగుదలను ఖండిస్తూ చేపట్టిన అప్పటి నిరసనల్లో సుమారు 1500 మంది ప్రజలు మరణించినట్లు మీడియా వెల్లడించింది. అయితే భద్రతా బలగాల చేతిలో మరణించిన ఏడుగురితో పాటు బుధవారం మరో ముగ్గురు మరణించారని హెంగావ్లోని కుర్దీష్ హక్కుల సంఘం ప్రకటించింది. భద్రతాదళాల చేతుల్లో నిరసనకారులు మరణించారన్న వార్తలను అధికారులు ఖండిస్తున్నారు. నిరసనకారులు ఒక మసీదు, బస్సులను తగులబెట్టి విధ్వంసం సృష్టించారనీ, బ్యాంకుపై దాడి చేశారని మీడియా పేర్కొంది.