Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్: రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు యూరోపియన్ యూనియన్ (ఈయూ) సిద్ధమైంది. రష్యా లక్ష్యంగా కొత్త ఆంక్షలతో ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మొదటి యుద్ధ సమీకరణ చేపట్టనున్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈయూ విదేశాంగ విధాన చీఫ్ తెలిపారు. న్యూయార్క్‌లో జోసెఫ్ బోరెల్ మీడియాతో మాట్లాడుతూ.. 27 రాష్ట్రాలు రష్యాపై కొత్త ఆంక్షలు, వ్యక్తిగత చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యాయన్నారు. ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాల సరఫరాను కొనసాగించనున్నట్టు తెలిపింది.