Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాలను రష్యా వ్యతిరేక వేదికగా మార్చిన బైడెన్
న్యూయార్క్ : పాక్షికంగా సైనిక సమీకరణకు చర్యలు తీసుకుంటున్నామని రష్యా అధ్యక్షులు పుతిన్ ప్రకటించిన నేపథ్యంలో అంతర్జాతీయ వేదికలపై రష్యాను విమర్శించేందుకు అమెరికా నేతృత్వంలోని పశ్చిమ దేశాలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. తాజాగా అందుకు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 77వ సమావేశాలు వేదిక య్యాయి. ఆ సమావేశాలను రష్యా వ్యతిరేక వేదికగా మార్చేం దుకు అమెకా అధ్యక్షులు బైడెన్ ప్రయత్నించారు. ఉక్రెయిన్ సంక్షోభం, తైవాన్ సమస్య రెండూ పూర్తిగా భిన్నమైనవైనప్పటికీ ఆ రెండింటినీ ముడి పెట్టేందుకు బైడెన్, బ్రిటన్, జపాన్ వంటి మిత్రదేశాలతో కలిసి దురుద్దేశ పూరితమైన ప్రయత్నాలు చేశారు. తద్వారా తన ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వాన్ని బయట పెట్టుకు న్నారని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. పైగా చైనా అంతర్గత అంశమైన తైవాన్ను జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించడం చాలా నిర్లక్ష్యపూరితమైన, ప్రమాదకరమైన చర్యగా పేర్కొంటున్నారు. దీనిపై చైనా పరిశీలకులు స్పంది స్తూ, భౌగోళిక, రాజకీయ కుమ్ములాటలకు కదన రంగంగా ఐక్యరాజ్య సమితి మారిన పక్షంలో ఇక ఆ సంస్థ ఉనికి ప్రాధాన్యత కోల్పోతుందని అన్నారు. మరోపక్క జనరల్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో చైనా, రష్యా విదేశాంగ మంత్రులు వాంగ్ యి, సెర్గెవ్ లావ్రావ్ తాజాగా భేటీ అయ్యారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలుగా, బాధ్యతాయుతమైన అగ్ర దేశాలుగా చైనా, రష్యా తమ పాత్ర పోషించాలని నిర్ణయిం చాయి. తద్వారా అంతర్జాతీయ వ్యవస్థ మరింత సహేతుకంగా వుంటుందన్నారు. అంతేకానీ ఏకపక్షవాదం, అధికార రాజకీయాలు ఇక్కడ పనికిరావని విమర్శించారు.