Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫోటోతో యాంకర్ నిరసన
న్యూయార్క్: హిజాబ్ ధరించలేదంటూ తనకు ఇంటర్వ్యూ ఇచ్చేందుకు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ నిరాకరంచడంతో .. ప్రముఖ జర్నలిస్ట్ క్రిస్టియన్ అమన్పూర్ వినూత్నంగా నిరసన తెలిపారు. ఇంటర్వ్యూకి సిద్దమైన యాంకర్.. ఎదురుగా ఖాళీ సీటుతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫోటోతో పాటు ఘటనకు సంబంధించిన వివరాలను తెలిపారు. న్యూయార్క్‌లోని ఐరాస కార్యాలయంలో యుఎన్ జనరల్ సమావేశాలు జరుగు తున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు ఇటీవల ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ న్యూయార్క్‌కు వచ్చారు. ఆయనను ఇంటర్వ్యూ తీసు కునేందుకు సిఎన్ఎన్ జర్నలిస్ట్ క్రిస్టియన్ అమన్పూర్ సిద్ధమయ్యారు. మరో 40 నిమిషాల్లో ఇంటర్వ్యూకి సిద్ధమవుతుండగా అధ్యక్షుని సహా యకుడు వచ్చారు. అమన్పూర్ను హెడ్స్కార్ప్ ధరించాల్సిందిగా ఆదే శించారు. అయితే బ్రిటన్ - ఇరాన్ కుటుంబానికి చెందిన అమన్పూర్ ధైర్యంగా తిరస్కరించారు. తాము న్యూయార్క్‌లో ఉన్నానని, ఇక్కడ హిజాబ్ ధరించాలనే సాంప్రదాయం, ఆంక్షలు, చట్టాలు లేవని స్పష్టం చేశారు. గతంలో ఇరాన్ అధ్యక్షులను దేశం బయట ఇంటర్వ్యూలు చేసిన సమయంలో కూడా హెడ్‌స్కార్ఫ్ ధరించలేదని అన్నారు. అయి నప్పటికీ హెడ్స్కార్ప్ ధరించాల్సిందేనని సహాయకుడు పట్టుబట్టారు. ఇది గౌరవానికి సంబంధించిన అంశమని, ఇప్పుడు ఇరాన్లో ఆందోళనలకు ఇదే కారణమని అతను పేర్కొన్నట్లు అమన్పూర్ తెలిపారు. తాను తిరస్కరించడంతో ఇంటర్వ్యూ రద్దైంది.
ఇరాన్లో జరుగుతున్న ఆందోళనలతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడటానికి చాలా కీలక సమయమని ఆమె పేర్కొన్నారు. అయితే అధ్యక్షుడు ఇంటర్వ్యూ ఇవ్వకుండా తిరస్క రించడం సరికాదని అన్నారు. ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటుతున్న సంగతి తెలిసిందే. హిజాబ్ ధరించలేదంటూ అదుపులోకి తీసుకున్న మాసా అమ్ని అనే మహిళ పోలీసుల చేతుల్లో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో హిజాబ్‌ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు హౌరెత్తు తుండటంతో.. అక్కడి ప్రభుత్వం ఇంటర్నెట్ను నిలిపివేసింది. ఇప్పటివరకు ఈ ఆందోళనల్లో 31 మందికి పైగా మరణించినట్లు సమాచారం.