Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో 9 రోజుల్లో బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికలు
బ్రసీలియా : మరో తొమ్మిది రోజుల్లో బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈనెల 19 నుంచి 21 వరకు రెండు రోజుల పాటు నిర్వహించిన ఒపీనియన్ పోల్స్‌లో వర్కర్స్ పార్టీ అధ్యక్షుడు లూలా డసిల్వాకి 49శాతం ఓట్లు లభించాయి. దేశవ్యాప్తంగా దాదాపు రెండు వేల మందిని ఇంటర్వ్యూ చేసి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. బ్రెజిల్ సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిశోధనా సంస్థ (ఐపిఇఎస్పిఇ) శుక్రవారం ఈ ఫలితాలను వెల్లడించింది. ప్రజల ప్రాధాన్యతలో లూలాకి 49శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో గెలుపొందడానికి 50శాతం ఓట్లు అవసరమైనందున ఆ ఒక్కశాతం ఓట్లు ఎన్నికల రోజు వచ్చేస్తాయని భావిస్తున్నారు. ఇక మితవాద అధ్యక్షుడు జేర్ బోల్సనారోకు 38 శాతం ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత ఎనిమిది శాతం ఓట్లతో సిరో గోమ్స్ మూడో స్థానంలో ఉన్నారు. గత సర్వేకు ఈసారికి 3శాతం ఓట్లు లూలాకి పెరిగాయి. గతసర్వేలో లూలాకి 46శాతం ఓట్లు రాగా, బోల్సనారో 35శాతం ఓట్లతో ఉన్నారు. బోల్సనారో తిరిగి ఎన్నికవకుండా అడ్డుకోవాలన్నది ప్రజల లక్ష్యంగా వుందని పోలింగ్ సరళి ద్వారా స్పష్టమవుతోంది. ప్రముఖుల మాటల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది.