Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇరాన్ ప్రభుత్వం
టెహ్రాన్ : మహిళలపై ఉక్కు పాదం మోపేందుకు ఇరాన్ ప్రభుత్వం సిద్ధమైంది. మహిళలు ఆందోళనల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ స్పష్టంచేశారు. ఆందోళనల పేరుతో దేశంలో తలెత్తిన హింసాత్మక ఘటనలను ఖండిస్తున్నట్టు ప్రకటించారు. హింసాత్మక ఘటనల్లో పాల్గొనేవారికి కఠిన శిక్షలు ఉంటాయనీ, ఇది ప్రజల నిర్ణయమంటూ ఓ అంతర్జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పౌరుల రక్షణే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ రెడ్ లైన్ అని, చట్టాన్ని అతిక్రమిస్తూ అల్లర్లకు పాల్పడేందుకు ఎవరినీ అనుమతించమని రైసీ పేర్కొన్నారు. జాతీయ సమైక్యతను లక్ష్యంగా చేసుకొన్న శత్రువు.. ప్రజలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవాలని కోరుకుంటున్నారని మండిపడ్డారు. నిరసనలకు, అల్లర్లకు ఎంతో తేడా ఉందని, ఇరాన్‌కు శత్రువైన అమెరికా దేశంలో అశాంతిని రేకెత్తిస్తోందని ఆరోపించారు. మాహ్సా అమ్ని మతిపై చింతిస్తున్నామని, విచారం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. ఫోరెన్సిక్‌తోపాటు న్యాయ నిపుణుల నివేదికలు త్వరలోనే వస్తాయని వెల్లడించారు. హిజాబ్ ధరించలేదంటూ న్యూయార్క్‌లో ఓ మహిళా జర్నలిస్టుకు ఇంటర్వూ ఇచ్చేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. హిజాబ్ ధరించలేదంటూ మోరాలిటీ పోలీసుల అదుపులోకి తీసుకున్న మాహ్సా అమ్ని అనే యువతి కస్టడీలో మరణించింది. దీంతో దేశవ్యాప్తంగా మహిళలు హిజాబ్, హెడ్స్కార్ఫ్లను వ్యతిరేకిస్తూ 12 రోజులుగా ఆందోళనలు చేపడుతున్నారు.