Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : బ్రిటన్లో ప్రధాన తపాలా సేవల సంస్థ 'రాయల్ మెయిల్'కు చెందిన కార్మికులు వేతన సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ బాట పట్టారు. బ్రిటన్ వ్యాప్తంగా రాయల్ మెయిల్ వర్కర్లు 48 గంటల పాటు సమ్మె ప్రారంభించా రు. మెయిల్ డెలివరీ కేంద్రాల్లోనూ, సార్టింగ్ కార్యాలయాల ఎదుట ధర్నాలు జరిగాయి. కమ్యూనికే షన్ వర్కర్స్ యూనియన్ (సిడబ్ల్యుయు) సభ్యులు శుక్రవారం తమ విధులను బహిష్కరించడంతో దేశవ్యాప్తంగా పోస్టల్ సర్వీసులకు విఘాతం కలిగింది.