Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సైన్స్, టెక్నాలజీ రంగంలో అగ్రభాగాన నిలవాలని పిలుపు
బీజింగ్:పెద్ద పాసింజర్ విమానమైన సి919ని అభివృద్ధిపరచడంలో సాధించిన పురోగతిని చైనా అధ్యక్షులు జీ జిన్పింగ్ శుక్రవారం ప్రశంసించారు. చైనాలో అత్యంత అధునాతమైన పరికరాల తయారీలో మరిన్ని విజయాలు సాధించాలని పిలుపిచ్చారు. ఇక్కడ గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్లో ప్రాజెక్టు విజయాలపై నిర్వహించిన ఎగ్జిబిషన్లో సి919 ప్రాజెక్టు బృంద ప్రతినిధులను శుక్రవారం జిన్పింగ్ కలుసుకున్నారు.దేశీయంగా చైనా అభివృద్ధిపరిచిన ఈ పాసింజర్ జెట్ విమానానికి చైనా పౌర విమానయాన నియంత్రణా సంస్థ నుండి సెప్టెంబరులో టైప్ సర్టిఫికెట్ లభించింది. ఈ ఏడాది చివరకల్లా మొదటి విమానాన్ని అందచేయనున్నారు. కీలకమైన సాంకేతికతలపై ప్రధానంగా దృష్టి పెట్టాలని జిన్పింగ్ కోరారు. ఇబ్బందులను, కష్టాలను అధిగమించడానికి కృషి కొనసాగాలన్నారు. భద్రత, విశ్వసనీయతకు ముందుగా పెద్ద పీట వేయాలన్నారు. భద్రతకు సంబంధించిన ఇబ్బందులన్నింటినీ తొలగించాలన్నారు. అతిపెద్ద విమాన తయారీ ప్రాజెక్టు సంపూర్ణంగా విజయవంతమైందన్నారు. సైన్స్, టెక్నాలజీ రంగంలో అంతర్జాతీయ స్థాయిని అందుకోవడానికి కృషి చేయాలని కోరారు. అంతర్జాతీయ ప్రామాణికాలకు అనుగుణంగా చైనా అభివృద్దిపరిచిన మొదటి ట్రంక్ లైన్ జెట్ విమానం సి919కి స్వతంత్ర మేథో సంపత్తి హక్కులు వున్నాయి. 2007లో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. 2017లో పూర్తయింది.