Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రస్సెల్స్ : యూరోజోన్ ద్రవ్యోల్బణం సెప్టెంబరు మాసానికి రికార్డు స్థాయిలో నమోదైంది. దీంతో అకక్టోబరులో యురోపియన్ సెంట్రల్ బ్యాంక్ మరోసారి వడ్డీ రేటును భారీగా పెంచుతుందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. యూరో కరెన్సీ అమల్లో వుండే 19దేశాల్లో సెప్టెంబరు మాసంలో ధరల పెరుగుదల 10శాతానికి చేరుకుంది. అంత కుముందు నెలల్లో ఈ పెరుగుదల 9.1శాతంగా వుందని యరోస్టాట్ డేటా శుక్రవారం తెలియచేసింది. 9.7శాతం వరకు పెరుగుతుందని భావించారు కానీ అది దాటి పది శాతాన్ని నమోదు చేయడం పరిస్థితి తీవ్రతను తెలియచేస్తోంది. యూరప్‌లో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీలో ద్రవ్యోల్బణం రేటు గత 70ఏళ్ళలో ఎన్నడూ లేని స్థాయికి చేరింది. ఇందుకు ప్రధానంగా ఇంధన, ఆహార ధరలే కారణంగా భావిస్తున్నారు. ఈ పెరుగుదల సేవల నుండి పారిశ్రామిక ఉత్పత్తుల వరకు పడుతుండడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. ఏడాది క్రితంతో పోలిస్తే ఇంధన ధరలు 41శాతం పెరిగాయి.