Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 180 మందికి పైగా తీవ్ర గాయాలు
- ఇండోనేషియా స్టేడియంలో ఘటన..
- మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
- తొక్కిసలాటలో మరణించిన 125 మంది
మలాంగ్ (ఇండోనేషియా) : ప్రపంచ స్పోర్ట్స్ చరిత్రలో అత్యంత విషాదకర సంఘటన. ఫుట్‌బాల్ మ్యాచ్‌కు చూసేందుకు వచ్చిన అభిమానులు అల్లర్లు, తొక్కిలసలాటతో ప్రాణాలు కోల్పోయారు. ఇండోనేషియాలోని మలాంగ్ (ఈస్ట్ జావ)లో ఈ ఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రి ఇక్కడ జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో జావనెసె క్లబ్‌పై సురబయ క్లబ్ విజయం సాధించింది. ఫలితాన్ని జీర్జించుకోలేని జావనెసె అభిమానులు మ్యాచ్ అనంతరం పిచ్‌పైకి దూసుకొచ్చారు. పిచ్‌లోకి వచ్చిన అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. టియర్‌గ్యాస్ ప్రయోగంతో పరిస్థితి అదుపు తప్పింది. స్టేడియం నుంచి బయటకు వెళ్లేందుకు అభిమానులు అందరూ ఒకే ద్వారం వైపు దూసుకెళ్లారు. ఈ క్రమంలో ఊపిరాడక, తొక్కిసలాట జరిగి 125 మంది ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది అభిమానులు మైదానంలోని పోలీసు వాహనాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. స్టేడియం బయట సైతం వాహనాలకు నిప్పు పెట్టారు. 180 మందికి పైగా అభిమానులు తీవ్ర గాయాలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషాదకర ఘటన పట్ల ఇండోనేషియా అధ్యక్షుడు, ఫిఫా అధ్యక్షుడు విచారం వ్యక్తం చేశారు.
పౌర సంఘాల ఆగ్రహం : ఫుట్‌బాల్ స్టేడియంలో తొక్కిసలాట, భారీ సంఖ్యలో అభిమానులు ప్రాణాలు కోల్పోవటం పట్ల పౌర సంఘాలు పోలీసుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఫిఫా నిబంధనల ప్రకారం మైదానం లోపల టియర్‌గ్యాస్ ప్రయోగించటం నిషేధం. అయినా, రూల్స్‌ను పక్కనపెట్టిన పోలీసులు అభిమానులపై టియర్‌గ్యాస్ ప్రయోగించారు. ఫలితంగా, తొక్కిసలాట, ఆక్సిజన్ స్థాయిలు తగ్గి ప్రాణాలు కోల్సోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మృతుల్లో ముగ్గురు పోలీసులు అధికారులు సహా చిన్నారులు సైతం ఉన్నారని సమాచారం. స్టేడియం సిబ్బంది, పోలీసులపై విచారణ జరిగే అవకాశం కనిపిస్తోంది.
ఇక, గతంలో క్రీడా స్టేడియాలో ఇటువంటి విషాద సంఘటనలు చోటుచేసుకున్న సందర్భాలు ఉన్నాయి. 1989లో ఇంగ్లాండ్‌లో జరిగిన తొక్కిసలాటలో లివర్‌పూల్‌కు చెందిన అభిమానులు 97 మంది మరణించగా, 2012లో ఈజిప్ట్‌లో జరిగిన ఘటనలో 74 మంది మరణించారు. 1964లో అర్జెంటీనా, పెరూ మధ్య ఒలింపిక్ క్వాలిఫయర్ మ్యాచ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో వెయ్యి మందికి పైగా గాయాలకు గురవగా, 320 మంది ప్రాణాలు కోల్పోయారు.