Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికార ప్రకటన విడుదల చేసిన ఇండోనేషియా
జకార్తా : ఫుట్‌బాల్ స్టేడియంలో జరిగిన తొక్కిసలాట మృతులపై ఇండోనేషియా ప్రభుత్వం అధికార ప్రకటన విడుదల చేసింది. 17 మంది చిన్నారులు సహా 125 మంది మరణించినట్టు ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన స్టేడియం విపత్తుల్లో ఇది ఒకటని అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విపత్తుపై వివరణనివ్వాల్సిందిగా ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోందని సంబంధిత అధికారులు తెలిపారు. ఇండోనేషియాలో ముఖ్యంగా రాజధాని జకార్తాలో ఫుట్‌బాల్ గేమ్‌తో పాటు హింస, గూండాయిజం ధీర్ఘకాలంగా కొనసాగు తూ ఉంటాయి. అయితే అతి చిన్న పట్టణమైన జావాలో శనివారం హింస చెలరేగడం ఇక్కడి సమస్యలను ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి తీసుకు వచ్చింది. ప్రభుత్వం నిజనిర్థారణ కోసం నిపుణులు, సాకర్ నిపుణులతో పాటు ప్రభుత్వ అధికారులతో ఒక బృందాన్ని ఏర్పాటుచేసిందని ఇండోనేషియా చీఫ్ సెక్యూరిటీ మినిస్టర్ మహ్ఫూద్ యండీ తెలిపారు. ఫుట్‌బాల్ విషాదం పేరుతో ఇండోనేషియన్ పత్రిక కొరాన్ టెంపో మొదటి పేజీలో ప్రచురించిందని అన్నారు. తన ఇద్దరు సోదరులను కోల్పోతామని తాను గాని, తమ కుటుంబం గాని ఊహించలేదని అహ్మద్ చయో అన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వచ్చే రెండు వారాల్లో విచారణ బృందం గుర్తిస్తుందని భావిస్తున్నామని అన్నారు.