Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టోక్యో : జపాన్‌పై మంగళవారం ఉత్తర కొరియా క్షిపణిని ప్రయోగించింది. ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణి పశ్చిమ పసిఫిక్ మహా సముద్రంపై పడిందని, ఎలాంటి నష్టం జరగలేదని జపాన్ అధికారులు తెలిపారు. ఈ క్షిపణి ప్రయోగాన్ని జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా తీవ్రంగా ఖండించారు. మరోవైపు మంగళవారం ఉదయం 7:23 గంటలకు ఉత్తర కొరియా క్షిపణిని జపాన్‌పై ప్రయోగించిందని దక్షిణాకొరియాకు చెందిన అధికారులు కూడా వెల్లడించారు. జపాన్‌పై ఉత్తర కొరియా క్షిపణిని ప్రయోగించడం ఐదేళ్ల తరువాత ఇదే మొదటిసారి. చివరిసారిగా 2017లో జపాన్‌పై క్షిపణిని ప్రయోగించింది.