Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 22 మంది చిన్నారులు సహా 34 మంది మృతి
- దుండగుడి ఆత్మహత్య
బ్యాంకాక్:థాయ్‌లాండ్‌లోని డేకేర్ సెంటర్‌పై గురువారం మాజీ పోలీస్ అధికారి కాల్పులకు తెగబ డ్డాడు. ఈ ఘటనలో 34 మంది మరణించినట్టు అధికారులు తెలిపా రు. ఈ ఘటన దేశంలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న నాక్లాంగ్ జిల్లాలోని నాంగ్‌బు నాలంఫూ ప్రావిన్స్‌లో చోటు చేసుకొంది. ఓ దుండగుడు మధ్యాహ్నం భోజన సమయంలో డే కేర్ సెంటర్లోకి ప్రవేశించి కాల్పులు జరిపాడని జిల్లా అధికారి జిదపా బూన్సమ్ తెలిపారు. 22 చిన్నారులు, ఐదుగురు సిబ్బందితో పాటు ఉపాధ్యాయురాలిని కాల్చి చంపాడు. ఆ ఉపాధ్యాయురాలు ఎనిమిది నెలల గర్భవతి అని అన్నారు. ఆ సయమంలో డేకేర్ సెంటర్లో 30 మంది చిన్నారులు ఉన్నారని చెప్పారు. భార్య, కుమార్తెను కాల్చి చంపిన అనంతరం దుండగుడు తనని కూడా కాల్చుకున్నట్లు బూన్సమ్ తెలి పారు. నిందితుడు 34 ఏండ్ల పాన్య ఖమ్రాప్ అని, డ్రగ్స్ వినియోగిం చినట్టు తేలడంతో గతేడాది విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు. వాస్తవానికి అతడు శుక్రవారం కోర్టు విచారణకు హాజరుకావాల్సి ఉంది. థాయ్లాండ్లోకాల్పుల ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. 2020లో నఖోమా రాట్చెస్మా నగరంలో ఓ సైనికుడు 29 మందిని కాల్చి చంపాడు. ఈ ఘటనలో 57 మంది గాయపడ్డారు. ఇతర దేశాల తో పోలిస్తే థాయ్‌లాండ్‌లో తుపాకీ వినియోగం అధికంగా ఉంటుంది. ఆయుధాల అక్రమ రవాణా సర్వసాదారణంగా జరుగుతుంటుంది.