Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేయర్‌తో సహా 18 మంది మృతి
మెక్సికో:లాటిన్ అమెరికాలోని మెక్సికో కాల్పులతో దద్దరిల్లింది. దక్షిణ మెక్సికోలోని శాన్ మిగ్యుల్ టోటోలాపాస్ నగరంపై స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 7.00 గంటలకు దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మేయర్ సహా 18 మంది మరణిం చారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మెక్సికన్ మేయర్ కన్రాడో మెన్డోజా సిటీ హాల్లో ఉన్న సమయంలో తుపాకులతో దుండు గులు విరుచుకుపడ్డారు. మేయర్‌తో పాటు ఆయన తండ్రి మాజీ మేయర్ జువాన్ మెన్డోజా కూడా మరణిం చారు. పోలీస్ అధికారులు, కౌన్సిల్ సభ్యులు, పలువురు అధికారులు కూడా మరణించారు. డ్రగ్స్ రవాణాతో సంబంధం ఉన్న క్రిమినల్ గ్యాంగ్ లాస్ టెక్విలెరోస్ ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్టు వీడియో విడుదల చేసింది. అయితే స్థానిక అధికారులు ధ్రువీకరించాల్సి వుంది. గెరెరో రాష్ట్రంలోని శాన్ మిగ్యుల్ టోటోలాపాస్ సిటీ హాల్ ముందు గోడలపై వందలాది తుపాకీ బుల్లెట్ల రంధ్రాలు ఏర్పడ్డాయి. సిటీ హాల్ మొత్తం మృతదేహాలు, రక్తంతో నిండిపోయిన దృశ్యాలను దుండగులు విడుదల చేశారు. దాడి తర్వాత భద్రతా బలగాలు నగరంలోకి ప్రవేశించ కుండా వాహనాలతో హైవేను బ్లాక్ చేసినట్టు అధికారులు తెలిపారు. మేయర్ మృతికి విచారం వ్యక్తం చేస్తున్నట్టు గెరెరో గవర్నర్ ఎవెలిన్ ట్వీట్ చేశారు. ఇటీవల కాలంలో మెక్సికో దాడులు పెరిగాయి. ఇది మూడో దారుణ ఘటన. గత నెలలో సెంట్రల్ మెక్సికన్ రాష్ట్రమైన గ్వానాజువాటోలోని ఓ బార్లో కాల్పులు జరగడంతో పది మంది మర ణించారు. దీని తర్వాత ఉత్తర మెక్సికోలో మరో దాడి జరిగింది. మెక్సికో లో ప్రభుత్వం డ్రగ్స్ నిరోధక ఆపరేషన్లు చేపట్టినప్పటి నుంచి అక్కడ పలు డ్రగ్స్ మాఫియా గ్రూపుల కాల్పులకు తెగబడుతున్నాయి. రాజ కీయ నేతలు, పోలీసులు, సైనికులే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు.