Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి
స్టాక్‌హౌం: సాహిత్యంలో అనీ ఎర్నాక్స్‌కు నోబెల్ పురస్కారం సాహి త్యంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం ఫ్రెంచ్ రచయిత్రి అన్నీ ఎర్నాక్స్‌ని వరించింది.వ్యక్తిగత జ్ఞాపకాల మూలా లను, వైరుధ్యాలను, సామూహిక పరి మితులను ధైర్యంగా సూక్ష్మ పరిశీలన తో తన రచనల్లో బహిర్గత పరిచినం దుకు గాను 82 ఏళ్ల ఎర్నాక్స్‌ను ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపిక చేసినట్టు రాయల్ స్వీడిష్ అకాడమీ వెల్లడించింది.
సాహిత్య రంగంలో అనీ ఎర్నాక్స్ చేసిన విశేషలను కొనియా డింది. లైంగిక అంశాలు, గర్భస్రావం, అనారోగ్యం, తన తల్లిదండ్రుల మర ణంపై ఆమె ఎలాంటి రాజీలేని రచన లు చేశారని అకాడమీ వెల్లడించింది. ఆమె రాసిన 30 పుస్తకాలు తన జీవిత ంలోను, తన చుట్టూ జరుగుతు న్న పరిణామాలను ప్రతిబింబించేలా సరళ మైన భాషలోనే రాశారని నోబెల్ సాహి త్య కమిటీ ఛైర్పర్సన్ ఆండర్స్ ఓల్సోన్ ప్రశంసించారు. లింగం, భాష, వర్గం అంశాలపై స్వీయ అనుభవాలతో విభిన్న కోణాల నుంచి విశ్లేషిస్తూ చేసే రచనలతో ఎర్నాక్ ప్రసిద్ధిగాంచారు.
1940లో నార్మాండీలోని యెవె టోట్ అనే చిన్న పట్టణంలో ఎర్నాక్స్ పుట్టి పెరిగారు. అక్కడే తల్లిదండ్రుల తో కలిసి ఓ దుకాణం, కేఫ్‌ను నడిపిన ఎర్నాక్స్.. రచయిత్రిగా సాగించిన ప్రయాణం ఎంత సుదీర్ఘమైనది, కష్టం తో కూడుకున్నది.
ఆమె 30కి పైగా సాహిత్య రచనలు చేశారు. ఎర్నాక్స్ రచనా శైలిలో అతి భావోద్వేగాలు, విప రీతమైన వర్ణనలు లేవన్నారు ఆండర్స్ ఓల్సోన్ అన్నారు. లాఫెజ్ పేరిట ఎర్నాక్స్ రాసిన పుస్తకంలో తన తండ్రి తో ఉన్న అనుబంధాన్ని ఆమె వర్ణించా రు. తనకు రచనా శైలి సహజంగానే వచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు. 'ద ఇయర్స్' పేరిట రాసిన నవలలో మూడో వ్యక్తిగా తన గురించి ప్రస్తావిం చిన ఎర్నాక్స్.. నేను అని కాకుండా ఆమె పేరుతో రాయడం విమర్శకుల ప్రశంసలు సైతం పొందింది. ఎన్నో అవార్డులను తెచ్చిపెట్టింది. గత కొన్నేళ్లుగా నోబెల్ పురస్కారం ఎర్నాక్స్ కు వస్తుందంటూ ఊహాగానాలు చెల రేగేవి. అయితే, అవి ఇప్పటికి నిజమ య్యాయి.
రసాయన శాస్త్రంలో విశేష పరిశోధనలు జరిపిన ముగ్గురు శాస్త్రవేత్తలకు..
రసాయన శాస్త్రంలో విశేష పరిశోధనలు జరిపిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్ బహుమతి 2022) లభించింది. క్లిక్ కెమిస్ట్రీతోపాటు బయోఆర్థోగోనల్ కెమిస్ట్రీలను అభివృద్ధి చేసినందుకు శాస్త్రవేత్తలు కరోలిన్ ఆర్ బెర్టోజీ, మార్టెన్ మెల్డల్, కే బ్యారీ షార్ప్లెస్ లను ఈ ఏడాది నోబెల్ పురస్కారానికి ఎంపిక చేసినట్టు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. కాగా ఈఏడాది పురస్కారానికి ఎంపి కైన జాబితాలో ఉన్న బ్యారీ షార్ప్లెస్.. రెండు సార్లు నోబెల్ బహుమతి అం దుకున్న ఐదో వ్యక్తిగా ఘనత సాధించ నున్నారు. 2001లో బ్యారీ షార్ప్లెస్ ఒకసారి నోబెల్ పురస్కారం పొందగా ఈ ఏడాది రెండోది అందుకోనున్నారు. ఇప్పటివరకు నోబెల్ బహుమతులను జాన్ బర్డీన్, మేరీ స్ల్కోదోవ్‌స్కా క్యూరీ, లైనస్ పాలింగ్, ఫ్రెడెరిక్ సాంగర్‌లు రెండుసార్లు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును స్వీకరించారు.
గతేడాది రసాయన శాస్త్రంలో నోబెల్ అవార్డుకు ఇద్దరు ఎంపికకాగా ఈసారి ముగ్గురు విజేతలుగా నిలిచా రు. పరమాణువు నిర్మాణంలో నూతన విధానమైన ఆర్గానో క్యాటల సిస్ అభివృద్ధి చేసినందుకు గాను 2021 లో బెంజిమిన్ లిస్ట్, డేవిడ్ మెక్‌మిల్లన్ లకు ఈ అవార్డు దక్కింది. రసాయన శాస్త్రాన్ని పర్యావరణహితంగా మార్చిన ఆ విధానం మానవాళికి ఎంతో ఉపయుక్తంగా ఉందని సెలక్షన్ కమిటీ అభిప్రాయపడింది. ఇప్పటివరకు వైద్య విభాగంతోపాటు భౌతిక, రసాయన శాస్త్రాలలో నోబెల్ బహుమతుల విజే తలను ప్రకటించారు. ఆర్థిక రంగం, శాంతి బహుమతులకు ఎంపికైన వారి పేర్లను వెల్లడించాల్సి ఉంది.
లనోబెల్ బహుమతి గ్రహీతలకు 10లక్షల స్వీడ ిష్ క్రోనర్ (సుమారు 9లక్షల డాలర్లు) నగదు అందుతుంది. వీటిని ఈ ఏడా ది డిసెంబర్ 10న అవార్డు గ్రహీతలకు అందజేస్తారు.